ఇష్టంతో పని చేస్తేనే సత్ఫలితాలు

ABN , First Publish Date - 2022-11-17T00:12:11+05:30 IST

ఉపాధి హామీ సిబ్బంది ఇష్టంగా విధులు నిర్వహించాలని, అప్పుడే సత్ఫలితాలు వస్తాయని డ్వామా ప్రాజెక్టు డైరక్టర్‌ చిట్టిరాజు అన్నారు.

 ఇష్టంతో పని చేస్తేనే సత్ఫలితాలు

శ్రీకాకుళం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ సిబ్బంది ఇష్టంగా విధులు నిర్వహించాలని, అప్పుడే సత్ఫలితాలు వస్తాయని డ్వామా ప్రాజెక్టు డైరక్టర్‌ చిట్టిరాజు అన్నారు. బుధవారం జిల్లా నీటియాజమాన్య సంస్థ కార్యాల యంలో అన్ని మండలాల టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలకు రోజువారీ వేతనం రూ.250 లభించేలా పని కల్పించాలని ఆదేశించారు. పనులకు కొరత లేకుండా ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు సమర్పిస్తుండాలని చెప్పారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటాలని సూచించారు. ఈ నెల 22, 23 తేదీల్లో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ జిల్లాకు రానున్నారని, అన్ని మండలాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎప్పటికప్పుడు జాబ్‌కార్డులను అప్‌డేట్‌ చేయాలన్నా రు. ప్రతి శుక్రవారం రోజ్‌గార్‌ దివాస్‌ సమావేశాలను నిర్వహించాలని చెప్పారు. వాటిద్వారా ప్రజల అభిప్రా యాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. డ్వామా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T00:12:11+05:30 IST

Read more