రీసర్వే నోటిఫికేషన్‌ ఇవ్వండి

ABN , First Publish Date - 2022-11-08T00:19:17+05:30 IST

జిల్లాలో భూ రీసర్వేకు సంబంధించి 85 గ్రామా ల్లో గ్రౌండ్‌ వ్యాలిడేషన్‌ పూర్తయిందని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరగా ఇవ్వాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆదేశించారు.

రీసర్వే నోటిఫికేషన్‌ ఇవ్వండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

శ్రీకాకుళం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూ రీసర్వేకు సంబంధించి 85 గ్రామా ల్లో గ్రౌండ్‌ వ్యాలిడేషన్‌ పూర్తయిందని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరగా ఇవ్వాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆదేశించారు. రీసర్వే, రీవెరిఫికేషన్‌, స్టోన్‌ ప్లాంటేషన్‌, గృహనిర్మాణ స్థలాలు, ఈకేవైసీ, గ్యాడ్ర్యుయేట్‌ ఓటర్ల నమోదుపై సోమవారం సాయంత్రం అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్టోన్‌ ప్లాంటేషన్‌ను నలుగురు సిబ్బందితో చేపట్టాలని ఆదేశించారు. తక్కువ స్థాయిలో రాళ్లను పాతడంపై సంబంధిత అధికారులను హెచ్చరించారు. పట్టభద్రుల ఓట్ల నమోదుకు 32,547 దరఖాస్తులు అందాయన్నారు. వాటిని పరి శీలించి ఆమోదించాలన్నారు. ప్రాధాన్య భవనాలను గుర్తించి.. పనులు పూర్తి చేయాలని ఆదే శించారు. జీజీఎంపీ పనులు ఈ నెలలో ప్రారంభం కావాల్సిందేనని, 15లోగా ప్రతిపాదనలు పం పాలన్నారు. సామాజిక మరుగుదొడ్ల పనులు ప్రారంభించని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులపై చర్య లు తప్పవని హెచ్చరించారు. జల్‌జీవన్‌ మిషన్‌ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే షోకాజ్‌నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. డీఆర్వో రాజేశ్వరి, ఆర్డీవో, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-08T00:19:17+05:30 IST

Read more