జీవో-117ను ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-07-06T05:25:30+05:30 IST

పాఠశాలల పునర్విభజన కోసంప్రభుత్వం జారీచేసిన జీవో-117 ఉపసంహరించుకోవాలని ఎస్‌టీయూ డిమాండ్‌ చేసింది.

జీవో-117ను ఉపసంహరించుకోవాలి
నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు:

ఆమదాలవలస రూరల్‌: పాఠశాలల పునర్విభజన కోసంప్రభుత్వం జారీచేసిన జీవో-117 ఉపసంహరించుకోవాలని ఎస్‌టీయూ డిమాండ్‌ చేసింది.మంగళవారం ఆమదాలవలసలో ఎస్‌టీయూ ఉపాధ్యాయులు సమావేశం నిర్వ హించారు. అనంతరం ఎంఈవో కార్యాలయం వద్ద  ఎస్‌టీయూ నాయకులు ఎస్వీరమణ, పి.ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు టి.పాపారావు, పేడాడ అన్నాజీ, బి.రమేష్‌, రాజేష్‌, మహేష్‌, రామకృష్ణ పాల్గొన్నారు.
Read more