బాణాంలో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2022-08-01T06:03:26+05:30 IST

బాణాం గ్రామంలో శనివారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరి గింది. ఈ ప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. సు మారు రూ.8 లక్షల ఆస్తినష్టం సంభవించింది.

బాణాంలో అగ్ని ప్రమాదం
కాలిపోయిన జీడిపిక్కలు


 రెండు పూరిళ్లు దగ్ధం... రూ.8 లక్షల ఆస్తినష్టం

పొందూరు, జూలై 31: బాణాం గ్రామంలో శనివారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరి గింది. ఈ ప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. సు మారు రూ.8 లక్షల ఆస్తినష్టం సంభవించింది. గ్రామానికి చెందిన అగత సోములు, అగత వెంకటరమ ణ తమ కుటుంబ సభ్యులతో నిద్రిస్తుం డగా శనివారం అర్ధరాత్రి 12.20  గంటల సమయంలో వారి ఇళ్ల నుంచి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. దీంతో వారు మేల్కొని కట్టుబట్టలతో బయటకు పరుగులు తీశారు. సోముల ఇంటిలో రూ.2.60 లక్షల నగదు, రూ.2లక్షల విలువచేసే జీడి పిక్కలు, వెంకటరమణ ఇంటిలో  రూ.40 వేల నగదు, జీడి పిక్కలు దగ్ధమయ్యాయి. వీటితో పాటు వ్యవసాయ బోరు, విద్యుత్‌ మోటారు,  టీవీలు, ఫ్రిజ్‌లు, ఫ్యానులు, ఇతర విలువైన ఎలకా్ట్రనిక్‌ వస్తులు కాలిపోయాయి. అర్ధరాత్రి కావడంతో ప్రమాదం ఏ విధంగా సంభవిం చిందో  తెలియలేదని బాధితులు తెలిపారు. రూ.8 లక్షల వరకు ఆస్తినష్టం  జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు.  ఆర్‌ఐ ఈశ్వరరావు, వీఆర్‌వో సాయి.. బాణాం వెళ్లి  బాధితులతో మాట్లాడారు. రెండు కుటుంబాలకు 5 కిలోల చొప్పున బియ్యం అందించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్‌ కింజరాపు వెంకటరమణ కోరారు. 


తక్షణమే నష్టపరిహారం అందించాలి: కూన రవికుమార్‌

బాణాం అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అం దించి ఆదుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. బాధితకుటుంబాలను ఆయన ఆదివారం పరామర్శించారు.  బాధితులకు   ఐఏవై గృహాలు మంజూరు చేయాలని, బూడిదైన జీడిపిక్కలకు నష్టపరిహారం అం దించాలని, వ్యవసాయ బోరు, మోటార్లను ఉచితంగా అందించాలని కోరారు. వీరిని ఆదుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు.  ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, ఏఎంసీ మాజీ  చైర్మన్‌ అన్నెపు రాము, నాయకులు కాలెపు శ్రీనివాసరావు, రాపాక బుజ్జి, బాణాం మాజీ సర్పంచ్‌ కె. రమణ, రామలక్ష్ము, తదితరులు పాల్గొన్నారు.

 

Read more