ఏగువబందపల్లిలో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2022-11-20T23:58:11+05:30 IST

ఏగువబందపల్లిలో శనివారం అర్ధరాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో తొమ్మిది వంటశాలలు దగ్ధమయ్యాయి. భీంపురం మాలమ్మ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు రేగాయి.

ఏగువబందపల్లిలో అగ్ని ప్రమాదం
కాలిపోయిన సామగ్రి

ఏగువబందపల్లిలో అగ్ని ప్రమాదం

తొమ్మిది వంటశాలలు దగ్ధం

రూ.10 లక్షల ఆస్తినష్టం

మెళియాపుట్టి, నవంబరు 20: ఏగువబందపల్లిలో శనివారం అర్ధరాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో తొమ్మిది వంటశాలలు దగ్ధమయ్యాయి. భీంపురం మాలమ్మ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు రేగాయి. మిగతా ఇళ్లకు వ్యాపించాయి. పి.బైరాగి, సీహెచ్‌ పోలయ్య, పి.రామారావు, సీహెచ్‌ లక్మీనారాయణ, పి.ఆదెమ్మ, బి.గౌరీష్‌, ఎన్‌.మహలక్ష్మి, శాంతమ్మలకు వంటశాలలు పూర్తిగా కాలిపో యాయి. ధ్యాన్యం, బియ్యం ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. రామారావు అనే బాధితుడికి చెందిన రూ.20 వేలు నగదుతోపాటు బంగారం, వెండి ఆభరణాలు కాలిపోయాయి. టెక్కలి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచే శారు. ఆదివారం రెవెన్యూ అధికారులు సందర్శించారు. రూ.10 లక్షల వరకూ ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేశారు. బాధిత కుటుంబాలను అదుకోవాలని టీడీపీ నాయకులు దినకరరావు, కృష్ణారావు కోరారు.

Updated Date - 2022-11-20T23:58:11+05:30 IST

Read more