ప్రభుత్వ స్థలాల్లో కంచె

ABN , First Publish Date - 2022-11-21T00:17:07+05:30 IST

సూదికొండ కాలనీకి చెందిన కొంతమంది సర్వే నెంబరు 151లో గల ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కంచెలు వేస్తున్నారు.

ప్రభుత్వ స్థలాల్లో కంచె
కంచెవేసిన దృశ్యం

పలాస: సూదికొండ కాలనీకి చెందిన కొంతమంది సర్వే నెంబరు 151లో గల ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కంచెలు వేస్తున్నారు. ఇప్పటికే కొండ వద్ద ఉన్న ప్రభుత్వ భూములన్నీ అమ్మకాలు జరిగిపోగా మిగిలిన స్థలాల్లో కూడా కంచె వేసి అమ్ముకుంటున్నారు. ఇటీవల అభివృద్ధి పేరుతో బీదలు వేసుకున్న పునాదులు తొలగించిన నేతలు తాజాగా ఆ స్థలాల్లో కంచె వేసి అందులో మొక్కలు పెంచుతున్నారు. ఆ తర్వాత పక్క సర్వే నెంబర్లు వేసి అమ్మేస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించి, ఆ స్థలాలు బీదలకు ఇవ్వాలని సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి ఎన్‌.గణపతి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-11-21T00:17:07+05:30 IST

Read more