‘లోన్‌ యాప్‌లను నమ్మొద్దు’

ABN , First Publish Date - 2022-11-24T23:33:59+05:30 IST

లోన్‌ యాప్‌లను నమ్మి వారి వలలో పడవద్దని లీడ్‌బ్యాంక్‌ మేనే జర్‌ హరిప్రసాద్‌ అన్నారు.

‘లోన్‌ యాప్‌లను నమ్మొద్దు’

అరసవల్లి: లోన్‌ యాప్‌లను నమ్మి వారి వలలో పడవద్దని లీడ్‌బ్యాంక్‌ మేనే జర్‌ హరిప్రసాద్‌ అన్నారు. స్థానిక అంబేడ్కర్‌ ఆడిటోరియంలో డ్వాక్రా ఏపీఎం, డీఎఫ్‌వో, వివిధ బ్యాంకులకు చెందిన అధికారులతో ఆయన గురువారం సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోన్‌ యాప్‌తో జరుగుతున్న నష్టాలను నివారించేందుకు, నేరాల కట్టడిపై ఈ నెల 30వ తేదీ వరకు ఖాతాదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. ఆధార్‌ నెంబరును ఎవరికీ చెప్పరాదన్నారు. ఏటీఎంలలో నగదును విత్‌డ్రా చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌, ఐసీఐసీఐ, ఏపీజీవీబీ, ఎస్‌బీఐ ఆర్‌ఎంలు మామిడి నర్సిం హమూర్తి, సుధాకర్‌, సోమశేఖర్‌, మెట్ట చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:33:59+05:30 IST

Read more