అన్యాయం చేయొద్దు

ABN , First Publish Date - 2022-12-13T00:02:33+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో 52తో గిరిజనులకు తీవ్రం అన్యాయం జరుగుతుందని, తక్షణమే వెనక్కు తీసుకోవాలని గిరిజన సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

అన్యాయం చేయొద్దు
సంప్రదాయ నృత్యంతో ర్యాలీగా వెళ్తున్న గిరిజనులు

- జీవో 52 రద్దు కోరుతూ గిరిజనుల ర్యాలీ

ఆమదాలవలస: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో 52తో గిరిజనులకు తీవ్రం అన్యాయం జరుగుతుందని, తక్షణమే వెనక్కు తీసుకోవాలని గిరిజన సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జీవో నెం.52ను రద్దు చేయాలని కోరుతూ పట్టణంలో వివిధ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బోయ వాల్మీకి, నకిలీ బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్‌ రోడ్డు మీదుగా గిరిజన సంప్రదాయ నృత్యాలతో స్పీకర్‌ క్యాంపు కార్యాలయం వరకు సాగిం ది. స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు సవర రాంబాబు, వాబయోగి గేదెల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:02:33+05:30 IST

Read more