న్యాయం చేయండి

ABN , First Publish Date - 2022-01-29T03:48:41+05:30 IST

ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ను రాజాంలో దళిత సంఘాల నాయకులు అడ్డుకున్నారు. శుక్రవారం రేగిడి మండలం బూరాడలో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా పాలకొండ రోడ్డులో అంబేడ్కర్‌ కూడలి వద్ద ఆయన వాహనాన్ని దళిత సంఘాల జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. కొత్తూరులో దళితుల భూముల విషయంలో జరిగిన అన్యాయంపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు డి.జమ్మయ్య, సామాజిక న్యాయ

న్యాయం చేయండి
కమిషన్‌ చైర్మన్‌ కారును అడ్డుకుంటున్న దళిత సంఘం నాకులు

- ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ను అడ్డుకున్న దళిత సంఘాల నాయకులు

రాజాం, జనవరి 28: ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ను రాజాంలో దళిత సంఘాల నాయకులు అడ్డుకున్నారు. శుక్రవారం రేగిడి మండలం బూరాడలో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా పాలకొండ రోడ్డులో అంబేడ్కర్‌ కూడలి వద్ద ఆయన వాహనాన్ని దళిత సంఘాల జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. కొత్తూరులో దళితుల భూముల విషయంలో జరిగిన అన్యాయంపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు డి.జమ్మయ్య, సామాజిక న్యాయ ుపోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్‌, రెల్లి కుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు బి.గుమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకటరావు తదితరులు సమస్యను వివరించారు. ‘1977లో సర్వే నెంబరు 267/1లో ఎస్సీ కార్పొరేషన్‌ భూములు కొనుగోలు చేసి కొత్తూరులో ఉన్న రెల్లి, కాపు కులస్తులకు చెందిన 120 మందికి పట్టాలు ఇచ్చారు. కొన్ని కోర్టు తగాదాలు ఉండడం వల్ల 2007 వరకు ఆ భూమిని దళితులకు అప్పగించలేదు. 2007 నాటికి కోర్టు కేసులు తేలడంతో ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. అప్పట్లో తహసీల్దార్‌ ఈ భూముల్లోనే కొంతమంది విలేకరులకు, నిర్వాసితులకు, బ్రోకర్లకు పట్టాలు ఇచ్చారు. దీనిపై 2015లో హైకోర్టులో కేసు వేయగా.. స్టేటస్‌కో కొనసాగుతోంది. హైకోర్టులో స్టేటస్‌కో ఉండగా అక్రమ నిర్మాణాలకు అవకాశం కల్పించిన పాలకొండ ఆర్డీవో, కొత్తూరు తహసీల్దార్‌, సీఐ, ఎస్‌ఐలపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి’ అని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. న్యాయం చేసేవరకూ పోరాడతామని తెలిపారు. దీనిపై ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ స్పందిస్తూ.. అన్ని శాఖల అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో దళిత సంఘాల నాయకులు శాంతించారు. కార్యక్రమంలో జి.సింహాచలం, వడమ శ్రీను, కె.శంకరనారాయణ, ఎం.త్రినాథరావు, దేవరాజు తదితరులు పాల్గొన్నారు


Read more