సౌత్‌జోన్‌ ఉషూ పోటీలకు జిల్లా క్రీడాకారులు

ABN , First Publish Date - 2022-11-24T23:41:41+05:30 IST

ఖేల్‌ ఇండియా సౌత్‌జోన్‌ నేషనల్‌ ఉషూ పోటీలకు జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు.

సౌత్‌జోన్‌ ఉషూ పోటీలకు జిల్లా క్రీడాకారులు
ఎంపికైన క్రీడాకారులు

అరసవల్లి, నవంబరు 24: Zఈ పోటీలు ఈ నెల 27వ తేదీ నుంచి 30 వరకు కేరళలో జరగనున్నాయి. సబ్‌జూనియర్‌ విభాగంలో పి.యషిత, బి.దేవిప్రియ, 39 కిలోల విభాగంలో టి.ఝాన్సీ, 45 కిలోలు ఆర్‌.తన్మయ్‌, 48కిలోలు లాస్యవర్షిత, 56 కిలోలు ఆర్‌.పావని, 60కిలోలు ముద్దాడ శిరీష, సీనియర్స్‌ విభాగంలో 45 కిలోల విభాగంలో కె.సౌజన్య ఎంపికయ్యారు. వీరు గురువారం కేరళకు బయలుదేరి వెళ్లారు. వీరికి జిల్లా ఉషూ అసోషియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పొగిరి కృష్ణంనాయుడు, రెడ్డి శివకుమార్‌ తదితరులు శుభాకాంక్షలు చెప్పారు. పతకాలతో జిల్లాకు తిరిగి రావాలని ఆకాంక్షించారు.

Updated Date - 2022-11-24T23:43:20+05:30 IST

Read more