రాక్షస పాలనతో ప్రజాస్వామ్యం ఖూనీ

ABN , First Publish Date - 2022-01-29T03:47:25+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. శుక్రవారం కంచిలి మండలం జిల్లుండ సమీపంలో టీడీపీ నేతలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘కక్షపూరితంగా వ్యవస్థను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పాలన సాగిస్తున్నారు. పంచాయతీల్లో నిధులు లేకుండా అభివృద్ధిని కాలరాశారు. ప్రజల సమస్యలను

రాక్షస పాలనతో ప్రజాస్వామ్యం ఖూనీ
మాట్లాడుతున్న ఎంపీ రామ్మెహన్‌నాయుడు.

ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు 

కంచిలి, జనవరి 28 : రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. శుక్రవారం కంచిలి మండలం జిల్లుండ సమీపంలో టీడీపీ నేతలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘కక్షపూరితంగా వ్యవస్థను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పాలన సాగిస్తున్నారు. పంచాయతీల్లో నిధులు లేకుండా అభివృద్ధిని కాలరాశారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు. పోలీసులు, కొంతమంది ఉద్యోగులు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎటువంటి అరాచకాలు చేసినా.. పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటా’నని తెలిపారు. అధికార పార్టీ అరాచకాలపై ‘ఏ మాత్రం తగ్గేదేలే’ అనే రీతిలో పోరు సాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

అంతా అరాచకమే : కూన రవికుమార్‌

వైసీపీ పాలనలో అరాచకమే తప్ప.. ప్రజలకు ఎటువంటి మేలు లేదని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. సీఎం జగన్‌ పాదయాత్ర సమయంలో ముద్దులు పెట్టి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ గుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. ‘పేదలకు అండగా టీడీపీ నిలిచేది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రజలను మరింత పేదలుగా మార్చేస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉండాలి’ అని కార్యకర్తలకు రవికుమార్‌ సూచించారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆరాచకాలకు ఎదురునిలిచి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు బి.కురయ్య, ఎం.రామారావు, బి.కామేష్‌రెడ్డి, టి.శోభన్‌బాబు, జగదీష్‌ పట్నాయక్‌, పి.పురుషోత్తంరెడ్డి, పి.సూర్యనారాయణరెడ్డి, ఎం.పూర్ణ పాల్గొన్నారు.


Read more