ఆదర్శనీయుడు సీవీ రామన్‌

ABN , First Publish Date - 2022-11-07T23:24:17+05:30 IST

భౌతిక శాస్త్రవేత్త సర్‌ సీవీ రామన్‌ జీవతాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.లత అన్నారు.

ఆదర్శనీయుడు సీవీ రామన్‌

నరసన్నపేట: భౌతిక శాస్త్రవేత్త సర్‌ సీవీ రామన్‌ జీవతాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.లత అన్నారు. సోమవారం కళాశాలలో సీవీ రామన్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు. జీవితంలో వైఫల్యాల నుంచి విజయం వైపు నడిచిన వ్యక్తి సర్‌ సీవీ రామన్‌ నిలిచా రన్నారు. కాంతిపై ప్రయోగాలు నిర్వహించి నోబుల్‌ బహుమతి పొందిన గొప్పవ్యక్తి రామన్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఢిల్లీశ్వరరావు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-07T23:24:17+05:30 IST

Read more