టీడీపీపై విమర్శలు సీఎం విజ్ఞతకే వదిలేస్తున్నాం

ABN , First Publish Date - 2022-11-24T23:39:29+05:30 IST

నవంబరు 24: నరసన్నపేట బహిరంగ సభలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి టీడీపీపై చేసిన విమర్శలు దౌర్భాగ్యమని, వాటిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే మాట లు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

టీడీపీపై విమర్శలు సీఎం విజ్ఞతకే వదిలేస్తున్నాం
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, నవంబరు 24: నరసన్నపేట బహిరంగ సభలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి టీడీపీపై చేసిన విమర్శలు దౌర్భాగ్యమని, వాటిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే మాట లు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం, ప్రజాప్రతినిధులు నరసన్నపేట వచ్చినట్లు లేదని, ఒక ఆర్థిక నేరగాళ్లు, ఉగ్రవాదులు వచ్చినట్లు బహిరంగ సభ తలపించిందన్నారు. పట్టణమంతా పోలీసు పహారాలో అష్టదిగ్భంధనం చేశారని విమర్శించారు. ప్రజలు ఆసుపత్రులకు వెళ్లేం దుకు, విద్యార్థులు పరీక్షలకు వెళ్లేందుకు వీలు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురిచేశారన్నారు. తెలుగువారి ఆత్మాభిమానం కాపాడేందుకు ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షం లో ఉన్నా ప్రజల పక్షాన ఉండి రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ప్రస్తు త పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాటు పడుతున్నారన్నారు. సీఎం బహిరంగ సభలో విధులు నిర్వ హించేందుకు వచ్చి గుండెపోటుతో హెచ్‌సీ మృతిచెందడం బాధాకరమని, ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపు తున్నామన్నారు. వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:39:29+05:30 IST

Read more