చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2022-01-04T05:00:53+05:30 IST

జిల్లాలో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం శ్రీకాకుళంలో వివిధ కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాలను కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పరిశీలించారు.

చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌
వ్యాక్సిన్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌

ప్రతి ఒక్కరూ టీకా వేసుకోండి

కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

గుజరాతీపేట, జనవరి 3: జిల్లాలో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం శ్రీకాకుళంలో వివిధ కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాలను కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘జిల్లాలో 15 నుంచి 18ఏళ్ల  చిన్నారులు 1.34 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించాం. 929 గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. జిల్లాలో మొదటి డోసు వ్యాక్సిన్‌ ఇప్పటికే శతశాతం పూర్తి చేశాం. రెండో డోసు 70 శాతం పూర్తయింది. కరోనా నుంచి రక్షణ కోసం ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి’ అని సూచించారు. వ్యాక్సినేషన్‌పై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు. డీఎంహెచ్‌వో బి.జగన్నాథరావు మాట్లాడుతూ వ్యాక్సిన్‌ సురక్షితమైందని పేర్కొన్నారు. శరీరతత్వం అనుసరించి ఒకటి, రెండు శాతం మందికి కొద్దిపాటి జ్వరం, ఒంటినొప్పులు రావచ్చని తెలిపారు. దానికి ఆందోళన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో డీఐవో కొయ్యాన అప్పారావు, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-04T05:00:53+05:30 IST