విద్యార్థుల మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయండి

ABN , First Publish Date - 2022-09-20T04:50:29+05:30 IST

ఎచ్చెర్ల గురుకులాల్లో దళిత విద్యార్థుల వరుస మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ నేతలు మా

విద్యార్థుల మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయండి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న జేఏసీ నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట దళిత సంఘాల ధర్నా
కలెక్టరేట్‌, సెప్టెంబరు 19:
ఎచ్చెర్ల గురుకులాల్లో దళిత విద్యార్థుల వరుస మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ నేతలు మాట్లాడుతూ గురుకులాల్లో వరుసగా విద్యార్థులు మరణిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున బాధిత కుటుంబంలో వ్యక్తికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు ఆ శాఖ అధికారి యశోధ లక్ష్మిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారన్నారు. అయితే ఇది జరిగి మూడు వారాలు దాటుతున్నా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. తక్షణం మంత్రి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. సంఘ నాయకులు డి.గణేష్‌, ఎం.కృష్ణయ్య, ఎస్‌.రామారావు, సీతారాం, కె.గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more