రాజీయే రాజమార్గం

ABN , First Publish Date - 2022-02-23T05:51:20+05:30 IST

రాజీయే రాజమార్గమన్న విషయాన్ని కక్షిదారు లకు తెలియజేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ గుత్తాల గోపి సూచించారు.

రాజీయే రాజమార్గం
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి

లోక్‌అదాలత్‌లో

 అత్యధిక కేసులను రాజీ చేయాలి

 జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి

గుజరాతీపేట, ఫిబ్రవరి 22: రాజీయే రాజమార్గమన్న విషయాన్ని కక్షిదారు లకు తెలియజేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ గుత్తాల గోపి సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగ ణంలో పోలీసు అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, న్యాయాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మార్చి 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో అత్యధిక కేసులను రాజీ చేయాలని  తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రాజీ అవ్వని కేసులను పరిష్కరించుకునేలా కక్షిదారులకు అవగాహన కలిగించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు తిరుమల వెంకటేశ్వర్లు, కె.అన్నపూర్ణమ్మ, పి.శ్రీదేవి, జిల్లా సివిల్‌ జడ్జిలు కె.నాగమణి, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు ఎన్‌.శ్రీలక్ష్మి, కె.రాణి, ఎన్‌.జాస్విన్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.జయలక్ష్మి పాల్గొన్నారు. 

 బాల్యవివాహాలు నేరం

 బాల్య వివాహాలు, లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి అన్నారు. మంగళవారం స్థానిక రైతు బజారు వద్ద మెప్మా సంఘాలతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయ సహాయం కావాల్సిన వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని తెలిపారు. ఈ సదస్సులో మెప్మా టెక్నికల్‌ ఆపీసర్‌ కె.సన్యాశిరావు పాల్గొన్నారు.  
Read more