‘ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదు’

ABN , First Publish Date - 2022-11-24T23:34:55+05:30 IST

నరసన్నపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగ న్మోహన్‌రెడ్డి ఉద్దానం కిడ్నీ బాధితులు విషయంలో జనసేన అధినేత పవన్‌క ల్యాణ్‌పై చేసిన వాఖ్యలు సరికాదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు తెలిపారు.

‘ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదు’

ఇచ్ఛాపురం: నరసన్నపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగ న్మోహన్‌రెడ్డి ఉద్దానం కిడ్నీ బాధితులు విషయంలో జనసేన అధినేత పవన్‌క ల్యాణ్‌పై చేసిన వాఖ్యలు సరికాదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడు తూ.. ఉద్దాన కిడ్నీ సమస్య కోసం పత్రికల్లో వచ్చిన వార్తలకు ఏ నాయకుడు స్పందించలేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ స్పందించి 2017 జనవరి 3న ఇచ్ఛాపురంలో కిడ్నీ బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకున్నార న్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పన దుర్యోధనరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:34:55+05:30 IST

Read more