నేను పోకముందే.. పరిహారం ఇవ్వండి!

ABN , First Publish Date - 2022-07-19T05:14:40+05:30 IST

డెబ్బై ఏళ్ల వృద్ధుడు. నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇరవై నాలుగు గంటలూ మంచంపైనే. సొంతంగా ఏపనీ చేసుకోలేడు. అన్నం కూడా తినలేడు. ఎవరో ఒకరు తినిపించాల్సిందే. ఇంత దుర్భరంగా ఉన్నా అధికారులు కనికరించలేదు. ఆయనకు రావాల్సిన పరిహారం ఇవ్వలేదు. సోమ వారం ఇలా కుటుంబీకుల సాయంతో కుర్చీ మీద ‘స్పందన’కు వచ్చాడు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ ఎదుట కన్నీటిపర్యంతం అయ్యాడు.

నేను పోకముందే.. పరిహారం ఇవ్వండి!

కలెక్టర్‌ ఎదుట కంట తడిపెట్టిన దివ్యాంగ వృద్ధుడు
చావుబతుకుల మధ్య ‘స్పందన’కు తీసుకువచ్చిన కుటుంబీకులు
(కలెక్టరేట్‌, జూలై 18)

డెబ్బై ఏళ్ల వృద్ధుడు. నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇరవై నాలుగు గంటలూ మంచంపైనే. సొంతంగా ఏపనీ చేసుకోలేడు. అన్నం కూడా తినలేడు. ఎవరో ఒకరు తినిపించాల్సిందే. ఇంత దుర్భరంగా ఉన్నా అధికారులు కనికరించలేదు. ఆయనకు రావాల్సిన పరిహారం ఇవ్వలేదు. సోమ వారం ఇలా కుటుంబీకుల సాయంతో కుర్చీ మీద ‘స్పందన’కు వచ్చాడు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ ఎదుట కన్నీటిపర్యంతం అయ్యాడు.

...............
నడవలేని స్థితిలో ఉన్న ఈ దివ్యాంగ వృద్ధుడి పేరు గైరు వరహాలు (పై చిత్రం). రణస్థలం మండలం సంచాం గ్రామం. తనకు నష్ట పరిహారం చెల్లింపులో అధికారుల నిర్ల క్ష్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు.. కుటుంబ సభ్యుల సహాయంతో సోమవా రం జడ్పీలో నిర్వహించిన ‘స్పందన’కు చేరుకున్నాడు. చావుబతుకుల మధ్య ఉన్నానని.. తాను పరలోకానికి చేరక ముందే పరిహారం ఇప్పించాలని కన్నీటి పర్యంతమవుతూ.. కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ను వేడుకున్నాడు. నిరుపేద అయి న వరహాలుకు 30 ఏళ్ల కిందట స్వగ్రా మంలో సర్వే నెంబర్‌ 236-3లో ఒక ఎకరా 29 సెంట్లను(డీ పట్టా) అధికా రులు సాగు కోసం ఇచ్చారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కోసం ఈ భూమిని 2018లో ట్రాన్స్‌కో అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకా రం జిరాయితీ భూములైనా.. డీ పట్టా భూములైనా నష్ట పరిహారం చెల్లించాలి. కానీ, ట్రాన్స్‌కో అధికారులు ఇంతవరకూ ఆయనకు నష్ట పరిహారం అందజేయ లేదు. దీంతో సోమవారం జడ్పీలో నిర్వ హించిన కలెక్టర్‌ స్పందన’కు ఆయన వచ్చాడు. నడవలేని స్థితిలో ఉన్నాడు. దీంతో ఆయన్ను కుటుంబీకులు కుర్చీలో కూర్చోబెట్టుఉని జడ్పీకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆ దివ్యాంగ వృద్ధుడు కలెక్టర్‌ ఎదుట తన ఆవేదన వెళ్లగక్కాడు. ‘సారూ.. నా స్థలాన్ని నాలుగేళ్ల కిందట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కోసం అధికారులు తీసుకున్నారు. పరిహారం అందించాల్సి ఉన్నా.. ఇంతవరకూ రూపాయి కూడా ఇవ్వలేదు. కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నా అధికారులు కనికరించడం లేదు. అప్పట్లో పరిహారం ఇస్తామని ప్రకటించి.. ప్రస్తుతం పట్టా రద్దయిందని చెబుతు న్నారు. మీరే న్యాయం చేయండి. చావు బతుకుల మధ్య ఉన్న దివ్యాంగ వృద్ధుడ్ని. నా భార్య కూడా వృద్ధురాలే. ఇక మేము తిరగలేం. నేను పరలోకానికి చేరకముందే పరిహారం ఇప్పించండి సారూ..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ఎదుట కంటతడి పెడుతూ.. దరఖాస్తు అంద జేశారు. దీనిని పరిశీలించి న్యాయం చేస్తామని కలెక్టర్‌ తెలిపారు.  
 


Updated Date - 2022-07-19T05:14:40+05:30 IST