డిజిటల్‌ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-11-24T23:33:55+05:30 IST

ఆన్‌లైన్‌, డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ ఎం. నర్సింహమూర్తి అన్నారు. గురువారం నరసాపురంలో స్టేట్‌బ్యాంక్‌లో ఖాతా దారులకు అవగాహన సదస్సు నిర్వ హించారు.

డిజిటల్‌ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలి
పోలాకి: మాట్లాడుతున్న ఎస్‌ఐ నర్సింహమూర్తి

నరసాపురం(పోలాకి): ఆన్‌లైన్‌, డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ ఎం. నర్సింహమూర్తి అన్నారు. గురువారం నరసాపురంలో స్టేట్‌బ్యాంక్‌లో ఖాతా దారులకు అవగాహన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతున్నాయన్నారు. బ్యాంక్‌ ఖాతా, ఏటీఎం పిన్‌, బ్యాంక్‌ లావాదేవీ లపై ఇతరులపై ఆధారపడ వద్దన్నారు. ఇతరులకు పిన్‌, ఓటీపీలను చెప్పవద్దన్నారు. బ్యాంక్‌ మేనేజర్‌ సంధ్యారాణి మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలని లేదా బ్యాంక్‌ లో సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం.ఈశ్వరరావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం

మెళియాపుట్టి: సైబర్‌ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని చాపర ఏపీజీవీబీ మేనేజర్‌ అభిషయ్‌ కుమార్‌ అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో మహిళా సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో అధికంగా సైబర్‌ నేరగాళ్లు మోసాలు చేయడం జరుగుతోందన్నారు. బ్యాంకులకు సంబంధించిన లావాదేవీ లపై ఎటువంటి ఓటీపీలు అడిగినా ఇవ్వవద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్ర కుమారి, వెలుగు ఏపీఎం లలిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:33:55+05:30 IST

Read more