షాపు ఖాళీ చేయమన్నందుకు..

ABN , First Publish Date - 2022-08-18T04:27:26+05:30 IST

షాపు ఖాళీ చేయమన్నందుకు ఓ వ్యక్తి.. దంపతు లపై కత్తితో దాడి చేసి హత్యాయత్నంకు పాల్పడిన ఘటన మండలంలోని అక్కయ్యవలస జంక్షన్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లే.. కొత్తపేట వద్ద జాతీయ రహదారిపై అక్కయ్యవలస జంక్షన్‌ సమీపంలో ఇదే గ్రామానికి చెందిన దాట్ల యర్రయ్యకు కొన్ని షాపులు ఉన్నాయి. ఇందులో ఒక దుకాణాన్ని అదే గ్రామానికి చెందిన దుక్క కృష్ణకు అద్దెకు ఇచ్చారు. మరో దుకాణంలో యర్రయ్య, అతని భార్య అప్పోజీ వాటర్‌ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. అయితే దుకాణానికి మరమ్మతులు చేయాలని, దాన్ని ఖాళీ చేయాలని పలుమార్లు పెద్దల సమక్షంలో కృష్ణకు.. యర్రయ్య దంపతులు చెప్పారు. అయినా కృష్ణ ఖాళీ చేసేవాడు కాదు. మంగళవారం రాత్రి కూడా యర్రయ్య దంపతులు కృష్ణ వద్దకు వెళ్లి షాపుని ఎప్పుడు ఖాళీ చేస్తున్నావని అడిగారు. దీంతో పదేపదే దుకాణాన్ని ఖాళీ చేయమంటారా అంటూ యర్రయ్య, అప్పోజిపై కారం చల్లి కత్తితో దాడిచేసి హత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో దంపతులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ షేక్‌ఖాదర్‌భాషా సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులను స్థానిక సామాజికి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్

షాపు ఖాళీ చేయమన్నందుకు..
దర్యాప్తు చేస్తున్న పోలీసులు

 దంపతులపై హత్యాయత్నం

 బాధితులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు

అక్కయ్యవలస జంక్షన్‌లో ఘటన

కోటబొమ్మాళి, ఆగస్టు 17: షాపు ఖాళీ చేయమన్నందుకు ఓ వ్యక్తి.. దంపతు లపై కత్తితో దాడి చేసి హత్యాయత్నంకు పాల్పడిన ఘటన మండలంలోని అక్కయ్యవలస జంక్షన్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లే.. కొత్తపేట వద్ద జాతీయ రహదారిపై అక్కయ్యవలస జంక్షన్‌ సమీపంలో ఇదే గ్రామానికి చెందిన దాట్ల యర్రయ్యకు కొన్ని షాపులు ఉన్నాయి. ఇందులో ఒక దుకాణాన్ని అదే గ్రామానికి చెందిన దుక్క కృష్ణకు అద్దెకు ఇచ్చారు. మరో దుకాణంలో యర్రయ్య, అతని భార్య అప్పోజీ వాటర్‌ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. అయితే దుకాణానికి మరమ్మతులు చేయాలని, దాన్ని ఖాళీ చేయాలని పలుమార్లు పెద్దల సమక్షంలో కృష్ణకు.. యర్రయ్య దంపతులు చెప్పారు. అయినా కృష్ణ ఖాళీ చేసేవాడు కాదు. మంగళవారం రాత్రి కూడా యర్రయ్య దంపతులు కృష్ణ వద్దకు వెళ్లి షాపుని ఎప్పుడు ఖాళీ చేస్తున్నావని అడిగారు. దీంతో పదేపదే దుకాణాన్ని ఖాళీ చేయమంటారా అంటూ యర్రయ్య, అప్పోజిపై కారం చల్లి కత్తితో దాడిచేసి హత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో దంపతులు  గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ షేక్‌ఖాదర్‌భాషా సిబ్బందితో కలిసి  ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులను స్థానిక సామాజికి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 
Read more