AP News: అరసవల్లిలో మూలవిరాట్‌ను తాకిన సూర్యకిరణాలు

ABN , First Publish Date - 2022-10-01T14:05:50+05:30 IST

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి.

AP News: అరసవల్లిలో మూలవిరాట్‌ను తాకిన సూర్యకిరణాలు

శ్రీకాకుళం: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి. ఏడాదిలో రెండు సార్లు ఈ అద్భుతం జరుగుతుంది. దక్షిణాయణం అక్టోబర్ 1, 2 తేదీలలో... ఉత్తరాయణం మార్చి 9, 10 తేదీలలోను స్వామివారికి కిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తరలివచ్చారు. దాదాపు ఐదు నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామివారిని తాకాయి. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని సూర్యకిరణాలు తాకడం చూసి భక్తులు పులకించిపోయారు. 

Read more