-
-
Home » Andhra Pradesh » Srikakulam » Anganwadi Workers Dharna-MRGS-AndhraPradesh
-
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
ABN , First Publish Date - 2022-03-17T05:18:03+05:30 IST
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

- అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్
- శ్రీకాకుళంలో ధర్నా
గుజరాతీపేట, మార్చి 16 : అరెస్టులు, నిర్బంధాలతో ఉద్య మాలను ఆపలేరని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు అన్నారు. విజయవాడలో శాంతి యుతంగా నిరాహార దీక్షలు చేపట్టిన అంగన్‌వాడీ కార్యకర్తలు, యూనియన్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయ కులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ సంఘం ఉద్యమానికి పిలుపునిచ్చినా అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమన్నారు. నిర్బంధంతో చాలామంది అంగన్‌వాడీలు మానసిక ఆందోళనకు గురౌతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేస్తున్నాయని ఆరో పించారు. బడ్జెట్‌లో కేటాయింపులు లేవని, నూతన విద్యావి ధానంతో ఐసీడీఎస్ లక్ష్యం నీరుగారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కోశాధికారి కె.కళ్యాణి, నాయకులు టి.రాజేశ్వరి, కె.ప్రమీలాదేవి, డి.సరస్వతి, ఈ.అప్పలనర్సమ్మ, సంధ్యారాణి, కృష్ణభారతి, జ్యోతి, అరుణ, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.