అరాచక పాలనను అంతం చేయాలి

ABN , First Publish Date - 2022-12-04T23:53:01+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దీనికి అంతం చేసే సమయం ఆసన్న మైందని టీడీపీ అధికార ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, పట్టణ నాయకుడు ఉణ్న వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం పట్టణంలో 11వ వార్డు పరిధి లచ్చుమన్నపేట, ఆదివారంపేట తదితర ప్రాంతాల్లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు.

అరాచక పాలనను అంతం చేయాలి

నరసన్నపేట: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దీనికి అంతం చేసే సమయం ఆసన్న మైందని టీడీపీ అధికార ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, పట్టణ నాయకుడు ఉణ్న వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం పట్టణంలో 11వ వార్డు పరిధి లచ్చుమన్నపేట, ఆదివారంపేట తదితర ప్రాంతాల్లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. మూడున్నరేళ్ల వైసీపీ పాలన లో పట్టణంలో అవినీతి, అక్రమాలు జోరందుకున్నాయని, మెయిన్‌ రోడ్డులో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైనా పట్టించుకోవడం లేదని విమర్శిం చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కింజరాపు రామారావు, నేతలు బోయన సతీష్‌, బోయన ఆనంద్‌, తాళాభక్తుల గోవిందరావు, లక్కోజి రామకృష్ణ, జి.ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.

‘అప్పులే తప్ప అభివృద్ధి ఏదీ’

సారవకోట (జలుమూరు): వైసీపీ పాలనలో రాష్ట్రంలో అప్పులే తప్ప అభివృద్ధి ఏదీ జరగలేదని టీడీపీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ అన్నారు. సవరడ్డపనస గ్రామంలో ఆదివారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఇంటింటింటికీ వెళ్లి వివరించారు. టీడీపీ బలోపేతానికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ అధ్యక్షుడు ధర్మాన తేజకుమార్‌, నాయకులు సురవరపు తిరుపతిరావు, తాడేల భీమారావు, పట్ట ఉమామహేశ్వరరావు, చీడి వెంకటరమణ, పాన్నాన శంకరరావు పాల్గొన్నారు.

బ్రాహ్మణతర్లాలో ‘ఇదేంఖర్మ మన రాష్ట్రానికి’

పలాసరూరల్‌: బ్రాహ్మణతర్లా గ్రామంలో గ్రామ టీడీపీ కమిటీ ఆధ్వర్యం లో ఆదివారం రాత్రి ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. పెద్దవీధి, ఇందిరాకాలనీల్లో టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభు త్వ అరాచకాలను ప్రజలకు వివరించారు. నిరుద్యోగులకు మొండిచేయి చూపి న ఘనత జగన్‌ ప్రభుత్వానికే దక్కుతుందని నేతలు విమర్శించారు. కార్య క్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గరుగు సింహాచలం, ప్రధాన కార్య దర్శి వడ్డి యాదగిరి, నాయకులు ఆర్‌.సుదర్శనరావు, కె.ధర్మారావు, ఎ.వెంక ట్రావు, గోరు వాసు, సింహాచలం, ఢిల్లీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-04T23:53:02+05:30 IST