మరింత భద్రంగా..

ABN , First Publish Date - 2022-10-04T04:51:50+05:30 IST

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో పాత రికార్డులన్నీ డిజిటల్‌ కానున్నాయి. పాత డాక్యుమెంట్ల కంప్యూటరీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1850 నుంచి 1999వ సంవత్సరం వరకు గల భూముల రికార్డులను డిజిటలైజేషన్‌ చేపడుతోంది. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యం నిర్థేశించింది. ఈ మేరకు జిల్లా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంతో పాటు, జిల్లావ్యాప్తంగా ఉన్న 13 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని పాత రికార్డులను ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డిజిటలైజేషన్‌ చేస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 39 మంది సిబ్బంది పని చేస్తున్నారు.

మరింత భద్రంగా..
జిల్లా సబ్‌ రిజిస్త్రార్‌ కార్యాలయంలో రికార్డులు స్కాన్‌ చేస్తున్న సిబ్బంది

- రిజిస్ట్రేషన్‌ రికార్డులన్నీ డిజిటల్‌
- 1850 నుంచి 1999 వరకూ దస్ర్తాల కంప్యూటరీకరణ
- ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పనులు
(ఇచ్ఛాపురం రూరల్‌)

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో పాత రికార్డులన్నీ డిజిటల్‌ కానున్నాయి. పాత డాక్యుమెంట్ల కంప్యూటరీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1850 నుంచి 1999వ సంవత్సరం వరకు గల భూముల రికార్డులను డిజిటలైజేషన్‌ చేపడుతోంది. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యం నిర్థేశించింది. ఈ మేరకు జిల్లా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంతో పాటు, జిల్లావ్యాప్తంగా ఉన్న 13 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని పాత రికార్డులను ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డిజిటలైజేషన్‌ చేస్తున్నారు.  సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 39 మంది సిబ్బంది పని చేస్తున్నారు. దీనికి అనుసంధానంగా కంప్యూటర్లు అమర్చారు. సగటున రోజుకు రెండు నుంచి నాలుగు వాల్యూమ్స్‌ పూర్తవుతున్నాయి. జిల్లాలో 1850 నుంచి 1999 వరకు 7,669 వాల్యూమ్స్‌ ఉన్నాయి. ఇప్పటివరకు 1,237 వాల్యూమ్స్‌ స్కాన్‌ చేశారు. డిసెంబరు 31 నాటికి పూర్తి చేయాలి. కానీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త విధానంలో ఈసీలను తీసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

1999కి ముందు రికార్డులన్నీ.. :
ప్రస్తుతం 1999 నుంచి జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్ల వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో ప్రజలకు లభ్యమవుతున్నాయి. 1999కు ముందు జరిగిన రిజిస్ట్రేషన్‌ వివరాలన్నీ దస్త్రాల రూపంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉన్నాయి. ఈ దస్త్రాలు కాలక్రమంలో పాడైపోతున్నాయి. భూములకు సంబంధించిన విలువైన సమాచారం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. పాతకాలం నాటి భూమి వివరాలు కావాల్సివస్తే సంబంధిత రికార్డుల బూజు దులిపి అందులో సమాచారాన్ని చేతిరాత రూపంలో ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి రోజుల తరబడి సమయం పడుతోంది. ఈ ఇబ్బంందులు లేకుండా భూమి రికార్డులు కంప్యూటరీకరిస్తే భవిష్యత్తులో భూములకు సంబంధించిన ఎటువంటి సమాచారమైనా తక్కువ సమయంలో పొందే అవకాశం ఏర్పడుతుంది. బ్రిటీష్‌ కాలంనాటి రికార్డులను సైతం  కంప్యూటరీకరించనున్నారు.  

జాగ్రత్తలు తీసుకుంటున్నాం :
పాత రికార్డులను కదిపిన సమయంలో పేపర్లు చిరిగిపోయే అవకాశం ఉంది. అందుకే అత్యంత జాగ్రత్తగా స్కాన్‌ చేస్తున్నాం. దీంతో ప్రక్రియ కొంచెం జాప్యమవుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే భూములకు సంబంధించిన అన్ని వివరాలు త్వరగా పొందేందుకు మార్గం సుగమం అవుతుంది.
-కె.మన్మధరావు, జిల్లా రిజిస్ట్రార్‌, శ్రీకాకుళం.

 

Updated Date - 2022-10-04T04:51:50+05:30 IST