పోలీస్‌ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలి

ABN , First Publish Date - 2022-12-13T23:38:03+05:30 IST

పోలీస్‌ శాఖలో ఉద్యోగాల నియామకానికి వయోపరిమితి ఐదేళ్లు పెంచాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.యుగంధర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక ఎస్సీ హాస్టల్‌ ప్రాంగ ణం వద్ద నిరుద్యోగులతో సమావేశం నిర్వహించారు.

పోలీస్‌ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలి
మాట్లాడుతున్న ఏఐవైఎఫ్‌ నాయకులు

టెక్కలి: పోలీస్‌ శాఖలో ఉద్యోగాల నియామకానికి వయోపరిమితి ఐదేళ్లు పెంచాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.యుగంధర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక ఎస్సీ హాస్టల్‌ ప్రాంగ ణం వద్ద నిరుద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నాలుగేళ్లుగా నిరుద్యోగులు పక్షాన ఏఐవైఎఫ్‌ అనేక ఆందోళనలు, నిరసన చేపట్టిం దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువ తను మోసం చేసేందుకే వయో పరిమితి తగ్గించి నోటిఫికేషన్‌ విడుదల చేసిందని ఆరో పించారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని బహిరంగంగా హామీ ఇచ్చి ఇప్పుడు తోకముడిచారని విమర్శించారు. ఇప్పటికైనా నిరుద్యోగులకు న్యాయం చేయాలని లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మురళి, శ్రీనివాసరావు, నేతలు రిషి, దానేష్‌, మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:38:03+05:30 IST

Read more