రూ.257 వేతనం అందేలా చర్యలు

ABN , First Publish Date - 2022-12-13T00:15:08+05:30 IST

కొలతలప్రకారం పనిచేయించి వేతనదారులకు రోజుకు రు.257 వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీడీ యుగంధర్‌ తెలిపారు.

రూ.257 వేతనం అందేలా చర్యలు

సారవకోట (జలుమూరు): కొలతలప్రకారం పనిచేయించి వేతనదారులకు రోజుకు రు.257 వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీడీ యుగంధర్‌ తెలిపారు. సోమవారం సారవకోట మండలంలోని చిన్నకిట్టాలపాడు వద్ద ఉపాధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీవో సత్యమూర్తి, టీఏ రామచంద్రరావు పాల్గొన్నారు.

‘శతశాతం పనులు కల్పించాలి’

నందిగాం: ఉపాధి వేతనదారులకు శతశాతం పనులు కల్పించాలని ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి కోరారు. సోమవారం స్థానిక మండలపరిషత్‌ కార్యాలయంలో మొండ్రాయివలస ఫీల్డ్‌అసిస్టెంట్‌గా నియమితులైన ఎం.రాంబాబుకు నియామకపత్రాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో హెచ్‌వీ రమణమూర్తి, ఉపాధి ఏపీవో ఎం.నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:15:08+05:30 IST

Read more