మోటార్లు బిగిస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-12-09T23:40:04+05:30 IST

పురపాలక సంఘం ద్వారా అందించే తాగునీటి కొళాయిలకు కొంతమంది మోటార్లు బిగిస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌ ఒక ప్రకటనలో హెచ్చరించారు.

మోటార్లు బిగిస్తే చర్యలు

ఆమదాలవలస: పురపాలక సంఘం ద్వారా అందించే తాగునీటి కొళాయిలకు కొంతమంది మోటార్లు బిగిస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌ ఒక ప్రకటనలో హెచ్చరించారు. పూజారిపేట, డాబాలవీధి, కొత్తకోటవీధి, చంద్రయ్యపేట రైల్వేగుట్‌, పాత బ్రిడ్జిని ఆనుకొని (పాత ఆమదాలవలస) సమీపాన తది తర ప్రాంతాల్లో కొళాయిలకు మోటార్లు అమర్చుతున్నట్టు ఫిర్యాదులు అందా యన్నారు. వీటిని వెంటనే తొలగించాలని, తనిఖీల్లో పట్టు బడితే మోటారు స్వాధీనం, అపరాధ రుసుంతోపాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2022-12-09T23:40:06+05:30 IST