ప్రమాదమా?...హత్యా...?

ABN , First Publish Date - 2022-08-21T05:44:17+05:30 IST

మండలంలోని ఉమా మహేశ్వర అగ్ర హారం గ్రామానికి చెందిన పాములపాటికి చెందిన యువకులు ప్రతాప్‌(30), బొందలపాటి ప్రభుదాసు(30) గత కొంత కాలంగా లారీ డ్రైవర్‌గా, క్లీనర్‌గా పని చేస్తున్నారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం వీరిద్దరూ విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌ వెళ్లారు. హైదరాబాద్‌ సమీపంలోని దుండిగల్‌ పోలీసు స్టేషన్‌ సమీపంలో ఔటర్‌రింగ్‌ రోడ్డు గండి మైసమ్మ ప్రాంతం వద్ద వారి లారీ టైరు పంక్చర్‌ అయింది. టైరును మార్చుతుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టగా ప్రతాప్‌, ప్రభుదాస్‌ మృతి చెందినట్లు పోలీసులు చెప్తున్నారు.

ప్రమాదమా?...హత్యా...?
ప్రతాప్‌ ఫైల్‌

ఇద్దరు యువకుల మృతిపై అనుమానాలు

హైదరాబాద్‌ నుంచి ఉమామహేశ్వర అగ్రహారం

చేరుకున్న మృతదేహాలు

రెండు కుటుంబాల్లో విషాదం 

ముండ్లమూరు, ఆగస్టు 20 : మండలంలోని ఉమా మహేశ్వర అగ్ర హారం గ్రామానికి చెందిన పాములపాటికి చెందిన యువకులు ప్రతాప్‌(30), బొందలపాటి ప్రభుదాసు(30) గత కొంత కాలంగా లారీ డ్రైవర్‌గా, క్లీనర్‌గా పని చేస్తున్నారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం వీరిద్దరూ విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌ వెళ్లారు. హైదరాబాద్‌ సమీపంలోని దుండిగల్‌ పోలీసు స్టేషన్‌ సమీపంలో ఔటర్‌రింగ్‌ రోడ్డు గండి మైసమ్మ ప్రాంతం వద్ద  వారి లారీ టైరు పంక్చర్‌ అయింది.  టైరును మార్చుతుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టగా ప్రతాప్‌, ప్రభుదాస్‌ మృతి చెందినట్లు పోలీసులు చెప్తున్నారు. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకిస్తున్నారని ప్రతాప్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే పాములపాటి ప్రతాప్‌  కొన్నాళ్ల నుంచి లారీ డ్రైవర్‌గా, బొందలపాటి ప్రభుదాసు క్లీనర్‌గా ఒకే లారీలో పని చేస్తున్నారు. ఐతే ఇద్దరు అద్దంకిలో లారీకి వెళ్లి హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందడం రెండు కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ రెండు కుటుంబాలు పోషించే వ్యక్తులు చని పోవడంతో బోరున విలపిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఇరువురు మృతి చెందగా, వారి ఆధార్‌ చిరునామాల ప్రకారం ఇక్కడకు పోలీసుల సమాచారం ఇచ్చారు. దీంతో రెండు కుటుంబాల వారు హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను శనివారం రాత్రి స్వగ్రామం ఉమామహేశ్వర అగ్రహారానికి శనివారం తీసుకువచ్చారు. ప్రతాప్‌కు భార్య, ఇద్దరు పిల్లలు, ఉండగా, ప్రభుదాసుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. 

ఇది హత్యే..?

ప్రతాప్‌ తల్లి సరస్వతి

తన కోడలు పాములపాటి మాలతి మార్కాపురానికి చెందిన చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని, ఆ క్రమంలో అడ్డుతొలగించేందుకు తన కుమారుడిని హత్య చేయించి ఉంటారని ప్రతాప్‌ తల్లి సరస్వతి అనుమానం వ్యక్తం చేసింది.  ఈనెల 6న తన కోడలు ఇంటి నుంచి అదృశ్యమైందని చెప్పారు. అప్పటి నుంచి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. 
Read more