-
-
Home » Andhra Pradesh » Srikakulam » A corrupt government should be merged into the Bay of Bengal-MRGS-AndhraPradesh
-
అవినీతి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి
ABN , First Publish Date - 2022-07-06T05:26:36+05:30 IST
రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతుందని, ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో స భ్యుడు కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు.

‘బాదుడే- బాదుడు’లో కళా పిలుపు
జి.సిగడాం, జూలై 5: రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతుందని, ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో స భ్యుడు కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు. మంగళవారం దవళపేట, మెట్టవలస గ్రామాల్లో బాదుడే-బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచకపాలన, రౌడీ రాజ్యం కొనసాగుతుందని ఆరోపించా రు. ఒక్క చాన్స్‌తో రాష్ట్రాన్ని అదోగతిపాలు చేసిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పెంచిన చార్జీలతో సామాన్య ప్రజలు బస్సు ఎక్కాలంటే భయ మేస్తుందన్నారు. రాష్ట్రాన్ని అప్పు లాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డేనని, ఇలాంటి చేతకాని ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపంచే సత్తా ఉన్న నాయకుడు ఒక్క చంద్రబా బునాయుడేనని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగాలంటే చంద్రబా బును మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా ఈ రెండు గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యా లను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నా యుడు, దవళపేట మాజీ సర్పంచ్ కంచరాన సూరన్నాయుడు, మెట్టవలస సర్పంచ్ కామోజుల ఆరుద్ర, ఎంపీటీసీ సభ్యుడు బెవర జగన్నాథ రావు, కామోజుల సీతారాం, మండలశాఖాధ్యక్షుడు కుమరాపు రవికుమార్, పైల రామకృష్ణంనాయుడు, టంకాల మౌళీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం: ఎంపీ, ఎమ్మెల్యే
సోంపేట రూరల్: టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. మంగళవారం మండలంలోని బుషాభద్ర, చౌక్‌పేట, బేసిరామచంద్రపురంల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దన్నారు. పార్టీకి కార్యకర్తలే వెన్నుముకఅని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరాడ చంద్రమోహన్, పార్టీ మండలాధ్యక్షుడు మద్దిల నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, మడ్డుకుమార్, రెల్ల శ్రీను, బతకల జోగారావు పాల్గొన్నారు.