8 మందిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-12-13T23:41:13+05:30 IST

పలాస మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పేడాడ విశ్వనాథం అనే వ్యక్తిని దానగొర గ్రామానికి చెందిన సవర లక్ష్మణరావుతో పాటు మరో ఏడుగురు వ్యక్తులు పలాస సీహెచ్‌సీలో దారుణంగా కొట్టి గాయపర్చిన సంఘటనపై పలాస మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు మంగళ వారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..

8 మందిపై కేసు నమోదు

పలాసరూరల్‌, డిసెంబరు 13: పలాస మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పేడాడ విశ్వనాథం అనే వ్యక్తిని దానగొర గ్రామానికి చెందిన సవర లక్ష్మణరావుతో పాటు మరో ఏడుగురు వ్యక్తులు పలాస సీహెచ్‌సీలో దారుణంగా కొట్టి గాయపర్చిన సంఘటనపై పలాస మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు మంగళ వారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. 2022 మార్చి 18న పలాస సీహెచ్‌సీలో బాధితుడు విశ్వనాథంపై సవర లక్ష్మణరావుతో పాటు మరో ఏడుగురు దాడి చేశారు. ఈ సంఘటనపై అప్పటిలో బాధితుడి బంధువు బమ్మిడి వేణుకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సరైన ఆధారాలు చూపించకపోవడం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసు నమోదులో జాప్యమైంది. దీనిపై బాధితులు మంగళవారం ఆసుపత్రి సీసీ ఫుటేజీలు కోర్టుకు పూర్తిస్థాయిలో సమర్పించడంతో మేజిస్ట్రేట్‌ పరిశీలించారు. మెజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు.

Updated Date - 2022-12-13T23:41:13+05:30 IST

Read more