12 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2022-12-13T23:38:03+05:30 IST

సున్నా డ గ్రామంలో పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసే బియ్యం నిల్వలను అక్రమంగా ఉంచిన ఇంటిపై దాడి చేసి 12 టన్ను ల బియ్యాన్ని విజిలెన్స్‌ అధికా రులు స్వాధీనం చేసుకున్నా రు.

12 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం
పట్టుబడిన బియ్యం బస్తాలుబడిన బియ్యం బస్తాలు

పలాసరూరల్‌: సున్నా డ గ్రామంలో పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసే బియ్యం నిల్వలను అక్రమంగా ఉంచిన ఇంటిపై దాడి చేసి 12 టన్ను ల బియ్యాన్ని విజిలెన్స్‌ అధికా రులు స్వాధీనం చేసుకున్నా రు. వివరాలిలా ఉన్నాయి.. సు న్నాడ గ్రామానికి చెందిన కుమ్మరి లావణ్య చాలా ఏళ్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి తన ఇంటి వద్దనే నిల్వ ఉంచుతోంది. ఈ నేపథ్యంలో వచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ ఎస్పీ సురేష్‌బాబు ఆదేశాల మేరకు ఆమె ఇంటిపై విజిలెన్స్‌ అధికా రులు దాడులు చేసి 254 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్‌ ఎస్‌ఐ రామారావు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.4.50 లక్షల విలువ ఉంటుందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నిందితురాలు పరారీలో ఉండడంతో కాశీబుగ్గ పోలీసులు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో నిల్వ ఉన్న బియ్యం ఇంటికి సీజ్‌ చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీఎస్‌డీటీ నీలి మకు అందజేశామని, అనంతరం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించడం జరు గుతుందన్నారు. దాడిలో ఆయనతో పాటు విజిలెన్స్‌ హెచ్‌సీలు సీకే అప్పన్న, ఐ.ఈశ్వరరావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:38:04+05:30 IST