రైల్వేకోర్టుకు హాజరైన ప్రత్యేకహోదా ఉద్యమకారులు

ABN , First Publish Date - 2022-11-23T03:41:09+05:30 IST

ప్రత్యేకహోదా సాధన కోసం ఆందోళన చేసిన మహిళా నేతలు విజయవాడలోని రైల్వేకోర్టుకు మంగళవారం హాజరయ్యారు.

రైల్వేకోర్టుకు హాజరైన ప్రత్యేకహోదా ఉద్యమకారులు

విజయవాడ, నవంబరు 22: ప్రత్యేకహోదా సాధన కోసం ఆందోళన చేసిన మహిళా నేతలు విజయవాడలోని రైల్వేకోర్టుకు మంగళవారం హాజరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం 2019 ఫిబ్రవరిలో విజయవాడ రైల్వేస్టేషన్‌ మొదటి ఫ్లాట్‌ఫాం మీదకు వెళ్లి నిరసన తెలపడంతో.. కాంగ్రెస్‌ పార్టీ మహిళా నేత సుంకర పద్మశ్రీ, సీపీఐ నాయకురాలు పెన్మత్స దుర్గాభవానితోపాటు మొత్తం 13 మందిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణ విజయవాడలోని రైల్వేకోర్టులో సాగుతోంది. కొద్దినెలలుగా విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి వారికి వారెంట్‌ జారీ చేశారు. దీంతో 13 మందిలో 11 మంది కోర్టుకు మంగళవారం హాజరుకాగా.. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదావేశారు.

Updated Date - 2022-11-23T03:41:09+05:30 IST

Read more