దసరాకు ప్రత్యేక బస్సు సర్వీసులు

ABN , First Publish Date - 2022-09-24T12:15:51+05:30 IST

దసరా పండుగను పురస్కరించుకుని ఈనెల 29 నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు రీజియనకు 184 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు

దసరాకు ప్రత్యేక బస్సు సర్వీసులు

అనంతపురం: దసరా పండుగను పురస్కరించుకుని ఈనెల 29 నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు రీజియనకు 184 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ సుమంత శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పండుగకు అనంతపురం వచ్చే ప్రయాణికుల కోసం హైదారాబాద్‌ నుంచి 35, విజయవాడ నుంచి 8, తిరుపతి నుంచి 7, బెంగళూరు నుండి 33, చెన్నై నుంచి 2, నెల్లూరు నుంచి 2 బస్సులు చొప్పున మొత్తం 87 బస్సులను ఈనెల 29 నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులుగా నడుపుతామన్నారు. పండుగ తర్వాత తిరుగు ప్రయణానికి అక్టోబరు 5 నుంచి 10వ తేదీ వరకు 97 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామని వెల్లడించారు. ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమైతే మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

Read more