ఉత్తరాంధ్రకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రండి: చంద్రబాబుకి స్పీకర్ సవాల్

ABN , First Publish Date - 2022-09-28T19:45:45+05:30 IST

ఆముదాలవలస (Amudalavalasa) నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు కేటాయించారని..

ఉత్తరాంధ్రకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రండి: చంద్రబాబుకి స్పీకర్ సవాల్

Srikakulam : ఆముదాలవలస (Amudalavalasa) నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు కేటాయించారని.. విమర్శిస్తున్న గుడ్డివారికి అభివృద్ధి ఏం కనిపిస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitharam) పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారని.. ఎవరు ఎలాంటివారో ప్రజలకు తెలుసన్నారు. అచ్చెన్నాయుడు (Atchennaidu)కి వచ్చే ఎన్నికల్లో ఎవరు దద్దమ్మలో తెలుస్తుందని తమ్మినేని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకి వారేం చేశారో.. మేం ఏం చేశామో.. తేల్చుకుందాం.. చర్చకు రండి అని సవాల్ విసిరారు. అయితే చర్చకు మాత్రం అచ్చెన్నాయుడు లాంటి పానకంలో పుడకలు వద్దన్నారు. డైరక్ట్‌గా టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu)కి సవాల్ విసురుతున్నానన్నారు. ఉత్తరాంధ్రకు 3 ఏళ్లలో మేం ఏం చేశామో... 14 ఏళ్లలో ఆయన ఏం చేశారో చర్చిద్దాం రావాలన్నారు. పేర్లు మార్చిన ఘనత టీడీపీదేనన్నారు. తన దగ్గర చాంతాడంత లిస్ట్ ఉందని తమ్మినేని పేర్కొన్నారు.

Read more