AP floods: వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ విఫలం: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2022-07-18T23:22:22+05:30 IST

వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ (YCP) విఫలమైందని బీజేపీ నేత సోమువీర్రాజు (Somu Veerraju) విమర్శించారు.

AP floods: వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ విఫలం: సోమువీర్రాజు

తిరుపతి: వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ (YCP) విఫలమైందని బీజేపీ నేత సోమువీర్రాజు (Somu Veerraju) విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లంక గ్రామాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని తెలిపారు. కోనసీమ జిల్లా (Konaseema District)లో బాధితులు తిరగబడినా అధికారులు పట్టించుకోలేదని తప్పుబట్టారు. వరద బాధితులకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయారని తెలిపారు. ముంపు మండలాల్లోని ప్రజలకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాల నిధులను పక్కదారి పట్టిస్తే ఊరుకోమని హెచ్చరించారు. దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana)కు తన శాఖపై సరైన అవగాహన లేదని సోము వీర్రాజు ఎద్దేవాచేశారు.

Read more