జగన్‌కు సోము వీర్రాజు బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2022-03-19T02:00:13+05:30 IST

సీఎం జగన్‌రెడ్డికి బీజేపీ నేత సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఏపీలో గృహ నిర్మాణాల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జగన్‌కు సోము వీర్రాజు బహిరంగ లేఖ

అమరావతి: సీఎం జగన్‌రెడ్డికి బీజేపీ నేత సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఏపీలో గృహ నిర్మాణాల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ట్టిడ్కో, అర్బన్ హౌసింగ్‌కి 32,909 కోట్లు ఖర్చుచేసినట్టు అసెంబ్లీలో ప్రకటించారన్నారు. అక్కడ అంతటి స్థాయిలో పనులు జరిగ లేదని విమర్శించారు. భూముల కొనుగోలకు ఎంత ఖర్చు చేశారో సీఎం చెప్పాలని నిలదీశారు. గ్రామీణ ఉపాధి పథకం నిధులు మౌలిక వసతులకు ఎంత ఖర్చు చేశారు?.. గృహ నిర్మాణంలో కేంద్రం నిధుల ప్రస్తావన ఎందుకు లేదు? అని లేఖలో సోమువీర్రాజు ప్రశ్నించారు.

Read more