Somireddy: జగన్ హాయాంలో దళితులు సహా.. ఒక్క కులానికి న్యాయం జరగలేదు...

ABN , First Publish Date - 2022-09-18T21:11:24+05:30 IST

టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.

Somireddy: జగన్ హాయాంలో దళితులు సహా.. ఒక్క కులానికి న్యాయం జరగలేదు...

అమరావతి (Amaravathi): టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan reddy) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నిండు శాసనసభలో సీఎం జగన్ (CM Jagan) భాషను ఖండించారు. జగన్ పార్టీ, ప్రభుత్వం పతనమయ్యే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. జగన్ హాయాంలో దళితులు సహా.. ఒక్క కులానికి న్యాయం జరగలేదని విమర్శించారు. ఒక కులాన్ని, కొన్ని పత్రికలను టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో ఒక సీఎం మాట్లాడటం మొదటసారిగా చూస్తున్నానన్నారు. ప్రజల ఆమోదంతో నడుస్తోన్న ఆంధ్రజ్యోతి పత్రిక పుట్టినప్పుడు.. తాను పుట్టలేదన్న విషయం ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలన్నారు. ఏబీఎస్ సహా.. కొన్ని ఛానల్స్ అంటే సీఎం జగన్‌కు భయమని అన్నారు. వైఎస్ సీఎం అయ్యాక అవినీతి పునాదుల మీద పుట్టిన పత్రిక సాక్షి అని ఆరోపించారు. బొత్సా, ధర్మాన, ఆనం రామనారాయణరెడ్డిలు గతంలో ఏమి మాట్లాడారో జగన్ ఒక్కసారి గుర్తుచేసుకోవాలన్నారు. ఇతర కులాలు వ్యాపారాలు చేసుకోకూడదా? అని ప్రశ్నించారు. జగన్ కుటుంబం సిమెంట్, ఇసుక, మద్యం, మైన్స్ వ్యాపారాలు చేయటంలేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ అధిపతిగా నిండు శాసనసభ సాక్షిగా ఒక కులాన్ని టార్గెట్ చేయటం సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యలపై సొంత ఎమ్మెల్యేలు సీఎం జగన్‌ను కలసే పరిస్థితి లేదన్నారు. జగన్ పాలనలో ఆయన సొంత సామాజినవర్గం వారే మనోవేదన చెందుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

Read more