Software Engineer: పెళ్లైంది.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్.. కానీ ఆ ఒక్క తప్పుతో జీవితం తలకిందులు..

ABN , First Publish Date - 2022-08-02T00:00:51+05:30 IST

సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి హత్యకేసులో మిస్టరీ వీడింది. ఆళ్ల శ్రీకాంత్రెడ్డి, మిధున కలిసి అతనిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఇద్దరినీ..

Software Engineer: పెళ్లైంది.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్.. కానీ ఆ ఒక్క తప్పుతో జీవితం తలకిందులు..

కృష్ణా: సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి హత్యకేసులో మిస్టరీ వీడింది. ఆళ్ల శ్రీకాంత్రెడ్డి, మిధున కలిసి అతనిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాంత్రెడ్డి సెల్ఫోన్ ఫార్మాట్ చేసే క్రమంలో అతని ప్రియురాలు మిధునతో ఉన్న ఫోటోలను శ్రీనివాసరెడ్డి చూశాడు. ఫొటోల పేరుతో మిధునను శ్రీనివాస్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశాడు. పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో శ్రీనివాసరెడ్డిని శ్రీకాంత్రెడ్డి, మిధున కలిసి హత్య చేశారు. తోట్లవల్లూరు మండలం యాకమూరుకు చెందిన గాడికొయ్య శ్రీనివాసరెడ్డి (37) చాగంటిపాడు శివారు ఆళ్లవారిపాలెంలో మిధున ఇంటి వద్ద జులై 26 తెల్లవారుజామున హత్యకు గురయ్యాడు. మిధున, శ్రీకాంత్ రెడ్డి కలిసి హత్యకు పాల్పడ్డారు. శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ‘వర్క్ ఫ్రం హోం’కు అవకాశం ఇవ్వడంతో యాకమూరులో ఇంటి నుంచే విధులు నిర్వహించేవాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. చాగంటిపాడు శివారు ఆళ్లవారిపాలెంకు చెందిన మిధునతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.



శ్రీనివాస్ రెడ్డి స్నేహితుడు భద్రిరాజుపాలెంకు చెందిన శ్రీకాంత్ రెడ్డికి కూడా అదే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమె వద్దకు రావద్దని శ్రీనివాసరెడ్డిని శ్రీకాంత్ రెడ్డి వారిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో జులై 25 రాత్రి శ్రీనివాసరెడ్డి ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసుకుని కంకిపాడు మండలం పునాదిపాడులో స్నేహితుడి వద్దకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి ఆళ్లవారిపాలెంలో మిధున ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో శ్రీకాంత్ రెడ్డి కూడా రావడంతో ఆగ్రహించి శ్రీనివాసరెడ్డిపై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాసరెడ్డి రక్తపు మడుగులో కుప్పకూలి మృతి చెందాడు. తొలుత ఇది కేవలం వివాహేతర సంబంధం గురించిన గొడవగానే పోలీసులు భావించినప్పటికీ పూర్తి విచారణలో బ్లాక్‌మెయిల్ కోణం కూడా ఉన్నట్లు బయటపడింది.

Updated Date - 2022-08-02T00:00:51+05:30 IST