ఏపీ మీదుగా భారత్ జోడో యాత్ర సాగుతుంది: శైలజానాథ్‌

ABN , First Publish Date - 2022-07-15T00:47:16+05:30 IST

పీ మీదుగా భారత్ జోడో యాత్ర సాగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ఏపీ మీదుగా భారత్ జోడో యాత్ర సాగుతుంది: శైలజానాథ్‌

ఢిల్లీ: ఏపీ మీదుగా భారత్ జోడో యాత్ర సాగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వరద ముంపు నదులను తలపిస్తున్నాయని విమర్శించారు. వరద సహాయ చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని తప్పుబట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధక్షుడు సోనియాను అనవసరంగా పిలుస్తున్నారని మండిపడ్డారు. ఈడీ పిలవాల్సింది అమిత్‌షా, ఆయన కుమారుడినని చెప్పారు. ఈడీ విచారణకు వ్యతిరేకంగా 21న విజయవాడలో కాంగ్రెస్‌ ఆందోళన చేస్తున్నట్లు శైలజానాథ్‌ ప్రకటించారు.

Read more