పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలు పెంచాలి

ABN , First Publish Date - 2022-09-11T09:21:27+05:30 IST

పురపాలక విద్యాశాఖపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విధాన పత్రాన్ని ఇవ్వాలని ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు.

పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలు పెంచాలి

మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలపై సదస్సులో వక్తలు 

విజయవాడ(గవర్నర్‌పేట), సెప్టెంబరు 10: పురపాలక విద్యాశాఖపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విధాన పత్రాన్ని ఇవ్వాలని ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. సదస్సుకు యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. బడ్జెట్‌ విద్యాశాఖది అయినప్పుడు పర్యవేక్షణ కూడా విద్యాశాఖది కావాలని, అందుకే తాము జీవో 84ను స్వాగతించామని తెలిపారు. ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ అర్భన్‌ ఎంఈవో, డివైఈవోలను క్రమపద్ధతిలో నియమించాలన్నారు. ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ పదోన్నతులు మున్సిపల్‌ పరిధిలోనే జరుగుతాయని, అవి ప్రతి సంవత్సరం నిర్వహించాలని, అర్భన్‌ పాఠశాలల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎ్‌సఎస్‌ ప్రసాద్‌ నివేదిక ప్రవేశపెడుతూ జీవో 77 మున్సిపల్‌ టీచర్లకు వర్తింపు చేయాలని డిమాండ్‌ చేశారు. సదస్సులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు.

Read more