-
-
Home » Andhra Pradesh » School children lunch is Rs588-NGTS-AndhraPradesh
-
బడి పిల్లల భోజనం రూ.5.88
ABN , First Publish Date - 2022-09-17T09:18:44+05:30 IST
బడి పిల్లల భోజనం రూ.5.88

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 8.57..సర్కారు ఉత్తర్వులు
బడి పిల్లల మధ్యాహ్న భోజనానికి ఇచ్చే ధరను ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు 48పైసలు... ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 72పైసలు పెంచుతూ పథకం డైరెక్టర్ దివాన్ మైదీన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి మధ్యాహ్న భోజనానికి రూ.5.4 ఇస్తుండగా దానిని రూ.5.88కి పెంచారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.7.85 ఇస్తుండగా దానిని రూ.8.57 చేశారు. ఈనెల 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.