త్వరలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: RTC MD

ABN , First Publish Date - 2022-02-23T17:26:43+05:30 IST

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఆర్టసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

త్వరలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: RTC MD

గుంటూరు: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను త్వరలో  పరిష్కరిస్తామని ఆర్టసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బుధవారం జిల్లాలోని నరసరావుపేటలో  ఆర్టీసీ ఎండీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 96 ప్రముఖ శైవ క్షేత్రాలకు 3200 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. కోటప్పకొండ తిరునాళ్ళకి జిల్లా నలుమూలల నుండి 410 బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భక్తులందరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం క్షేమమని ఆర్టీసీ ఎండీ సూచించారు. 

Read more