ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు

ABN , First Publish Date - 2022-10-04T02:47:51+05:30 IST

ఉరుకుంద భక్తులకు పెను ప్రమాదం తిప్పింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు

కోసిగి: ఉరుకుంద భక్తులకు పెను ప్రమాదం తిప్పింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 32 మంది ప్రయాణికులతో సోమవారం సాయంత్రం ఉరుకుంద నుంచి ఎమ్మిగనూరుకు బయలుదేరింది. కోసిగి మండల పరిధిలోని జుమాలదిన్నె సమీపంలోకి రాగానే బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. వంద మీటర్ల మేర అలాగే ముందుకు వెళ్లడంతో బస్సులోని ప్రయాణికులంతా భయంతో కేకలు వేశారు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి బస్సును రోడ్డుపై నిలిపేశాడు. దీంతో అందులో ఉన్న భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ అధికారులు డొక్కు బస్సులను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Read more