వేమూరులో రోశయ్య స్మృతివనం

ABN , First Publish Date - 2022-07-05T08:04:52+05:30 IST

రాష్ట్ర మాజీ ముఖ్యమ్రంతి కొణిజేటి రోశయ్య స్మారకార్థం ఆయన స్వగ్రామం బాపట్ల జిల్లా వేమూరులో విగ్రహావిష్కరణతో పాటు స్మృతివనం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి

వేమూరులో రోశయ్య స్మృతివనం

మంత్రి మేరుగ నాగార్జున వెల్లడి


వేమూరు, జూలై 4 : రాష్ట్ర మాజీ ముఖ్యమ్రంతి కొణిజేటి రోశయ్య స్మారకార్థం ఆయన స్వగ్రామం బాపట్ల జిల్లా వేమూరులో విగ్రహావిష్కరణతో పాటు స్మృతివనం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రోశయ్య జయంతిని పురస్కరించుకుని సోమవారం వేమూరులో ఆయన విగ్రహ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఖర్చులతోనే విగ్రహం, స్మృతివనం ఏర్పాటు జరుగుతాయని అన్నారు. 

Read more