కారును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-07-05T13:43:01+05:30 IST

వాకలపూడి కొరమండల్ బీచ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకువచ్చిన లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో

కారును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ..ఇద్దరు మృతి

కాకినాడ: వాకలపూడి కొరమండల్ బీచ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకువచ్చిన లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతులు సంజీవ్, తరుణ్ కుమార్‎గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more