-
-
Home » Andhra Pradesh » road accident-MRGS-AndhraPradesh
-
ఏలూరులో అదుపుతప్పి బోల్తాపడిన ట్రాక్టర్..నలుగురికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2022-04-24T14:08:45+05:30 IST
చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం శివారులో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా

ఏలూరు: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం శివారులో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు క్షతగాత్రులను చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్ లో సుమారుగా 20 మంది ఉన్నట్లు సమాచారం. చింతలపూడి మండలం బాలావారిగూడెం నుంచి పుట్రేపు మారెమ్మ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.