13 నదులకు పునరుజ్జీవం!

ABN , First Publish Date - 2022-03-16T09:10:47+05:30 IST

దేశంలోని 24 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోగల 13 నదులను పునరుజ్జీవింపచేయాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే

13 నదులకు పునరుజ్జీవం!

19 వేల కోట్లకుపైగా ఖర్చుచేయాలని కేంద్రం నిర్ణయం 

గోదావరికి రూ. 1,700 కోట్లు, కృష్ణకు రూ. 2,327 కోట్లు


న్యూఢిల్లీ, మార్చి 15: దేశంలోని 24 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోగల 13 నదులను పునరుజ్జీవింపచేయాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే అయిదేళ్లలో పునరుజ్జీవ కార్యక్రమానికి రూ. 19, 342 కోట్లను ఖర్చుచేయనున్నారు. ఈమేరకు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సంయుక్తంగా డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను ఇక్కడ విడుదల చేశారు. కాగా, పునరుజ్జీవ పథకంలో భాగంగా గోదావరి నది పునరుజ్జీవానికి రూ. 1,700.84 కోట్లు, కృష్ణా నదికి రూ. 2,327. 47 కోట్లు ఖర్చు చేయనున్నారు.    

Read more