ఏపీకి రెవెన్యూ లోటు 879 కోట్లు విడుదల

ABN , First Publish Date - 2022-06-07T10:00:23+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు గ్రాంట్‌ కింద కేంద్ర ప్రభుత్వం రూ.879.08 కోట్లను విడుదల చేసింది.

ఏపీకి రెవెన్యూ లోటు 879 కోట్లు విడుదల

న్యూఢిల్లీ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు గ్రాంట్‌ కింద కేంద్ర ప్రభుత్వం రూ.879.08 కోట్లను విడుదల చేసింది. నిధుల పంపిణీ తర్వాత (పోస్ట్‌ డెవల్యూషన్‌) ఏర్పడ్డ లోటు భర్తీకి 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసు మేరకు జూన్‌ నెల గ్రాంట్‌ను విడుదల చేసినట్లు సోమవారం  కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీకి రూ.2637.25 కోట్లు విడుదల చేశామని పేర్కొంది. కాగా, జూన్‌ నెల లోటుకు సంబంధించి 14 రాష్ట్రాలకు కలిపి ఆర్థిక శాఖ రూ.21550.25 కోట్లు విడుదల చేసింది.  

Read more