భారత స్కౌట్లు, గైడ్లకు అడ్మిషన్లలో రిజర్వేషన్‌

ABN , First Publish Date - 2022-09-13T09:02:04+05:30 IST

రాష్ట్రపతి సర్టిఫికెట్లు, ఇతర సర్టిఫికెట్లు కలిగిన భారత స్కౌట్లు, గైడ్లకు రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ప్రొఫెషనల్‌ కోర్సుల అడ్మిషన్లకు 0.5శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది.

భారత స్కౌట్లు, గైడ్లకు అడ్మిషన్లలో రిజర్వేషన్‌

అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి సర్టిఫికెట్లు, ఇతర సర్టిఫికెట్లు కలిగిన భారత స్కౌట్లు, గైడ్లకు రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ప్రొఫెషనల్‌ కోర్సుల అడ్మిషన్లకు 0.5శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే జేఎన్‌టీయూ కాకినాడ వీసీ జీవీఆర్‌ ప్రసాదరాజుకు జేఎన్‌టీయూ విజయనగరం వీసీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వు జారీచేసింది.

Read more