అమరావతిలో ఆర్థిక శాఖ సంస్థలు

ABN , First Publish Date - 2022-03-16T09:23:52+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతియే ఉంటుందని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించిన సంస్థలను అక్కడ ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక

అమరావతిలో ఆర్థిక శాఖ సంస్థలు

ఏర్పాటుకు అమరావతి పరిరక్షణ సమితి నేతల వినతి 


న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతియే ఉంటుందని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించిన సంస్థలను అక్కడ ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కారడ్‌కు అమరావతి పరిరక్షణ సమతి విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో కలిసి సమితి నేతలు శివారెడ్డి, తిరుపతి రావు మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు. అలాగే, హైకోర్టులో తమ తరఫున వాదించి విజయం సాధించినందుకు సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ కలిసి సత్కరించారు. 


Read more